PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇలా ఎలా నియమిస్తారు?: ఎంపీ రఘురామకృష్ణంరాజు

1 min read


పల్లెవెలుగు వెబ్: నరసాపురం ఎంపీ, వైసీపీ రెబల్ నేత రఘురామకృష్ణంరాజు సీబీఐ డైరెక్టర్​కు లేఖ రాశారు. వైఎస్ జగన్ తరపున వాదించిన న్యాయవాది పి.సుభాష్‌ను సీబీఐ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాదిగా నియమించడంపై ఆర్ఆర్ఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. స్టాండింగ్ కౌన్సిల్‌గా సుభాష్‌ను నియమిస్తే.. సీబీఐపై విశ్వాసం సన్నగిల్లుతుందన్నారు. వైఎస్ వివేకా హత్య, న్యాయమూర్తులపై దూషణల కేసుల విచారణ జరుగుతున్న నేపథ్యంలో సీబీఐ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాదిగా సుభాష్ నియామకంపై పలు సందేహాలకు, అనుమానాలకు తావిస్తోందన్నారు. పారదర్శకత దర్యాప్తు కోసం సుభాష్‌ను తొలగించాలని రఘురామకృష్ణంరాజు సీబీఐని డిమాండ్ చేశారు.

About Author