ఎల్ఐసీ కీలక నిర్ణయం !
1 min readపల్లెవెలుగువెబ్ : ఎల్ఐసీ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో ఐపీవోకి రానున్ననేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఎల్ఐసీ చైర్మన్ ఎం.ఆర్చ కుమార్ పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించింది. అలాగే మేనేజింగ్ డైరెక్టర్లలో ఒకరైన రాజ్ కుమార్ మరో సంవత్సరం పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. దీంతో ఎం.ఆర్. కుమార్ మార్చి 2023 వరకు చైర్మన్ హోదాలో కొనసాగనున్నారు. ఎల్ఐసీ చైర్మన్ పదవీ కాలాన్ని పొడిగించడం ఇది రెండోసారి. గత ఏడాది జూన్ లో ఎం.ఆర్. కుమార్ పదవి కాలాన్ని 9 నెలల పాటు పొడిగించారు. ఎల్ఐసీ ఐపీవో ప్రక్రియ సజావుగా సాగాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.