ఎల్ఐసి వ్యాపార అభివృద్ధికి కృషి
1 min read– ‘లియాఫీ’ డివిజన్ అధ్యక్షులు జయ భారత్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ కడప : ఎల్ఐసి వ్యాపార అభివృద్ధికి ఏజెంట్లు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (లియాఫీ) డివిజన్ అధ్యక్షులు జయ భారత్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం విశ్వేశ్వరయ్య భవన్లో లియాఫీ జేఏసీ కడప డివిజన్ 2వ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెంట్లకు మెడీ క్లేములు చెల్లించాలని కోరారు. డెత్ క్లైములు త్వరగా పరిష్కరించాలని పేర్కొన్నారు. గ్రూప్ ఇన్సూరెన్స్ మొత్తాన్ని పెంచాలని చెప్పారు. డెవలప్మెంట్ ఆఫీసర్స్ పోస్టులలో ఏజెంట్లకు 25 శాతం రిజర్వేషన్స్ ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎస్ డి ఎం గిరిధర్ మాట్లాడుతూ ఎల్ఐసి అభివృద్ధి లో ఏజెంట్ల పాత్ర కీలకమన్నారు. మంచి వ్యాపారాన్ని చేసి కడప డివిజన్ ను ప్రథమ స్థానంలో నిలవాలని పిలుపునిచ్చారు. తమ పరిధిలో సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమిష్టి కృషితో ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. ఏజెంట్లకు వ్యాపారమే ఆక్సిజన్ గా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో ఆలిండియా ప్లానింగ్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి, జోనల్ చైర్మన్ కృష్ణారెడ్డి, డివిజన్ కార్యదర్శి కదిరప్ప, కోశాధికారి కృష్ణ, డివిజన్ ప్లానింగ్ కమిటీ చైర్మన్ నాగ శివారెడ్డి, ఉమెన్ వెల్ఫేర్ చైర్మన్ ఆర్ మాధవి, కార్యనిర్వాహక కార్యదర్శి ఇస్మాయిల్, కడప బ్రాంచ్ అధ్యక్షులు నిత్యానంద రెడ్డి, ఉపాధ్యక్షులు రాజేంద్ర, రెసిడెన్షియల్ కార్యదర్శి బి. రామచంద్రారెడ్డి, జోనల్ ఈసీ మెంబర్ చంద్ర మోహన్ రెడ్డి, డివిజన్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు చెన్నయ్య, సెక్రటరీ ఈశ్వర్ రెడ్డి, కోశాధికారి కె.వి.రమణారెడ్డి, ఏజెంట్లు పాల్గొన్నారు.