NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఏజెంట్ల సమస్యలను పరిష్కరించాలి

1 min read

పల్లెవెలుగు , వెబ్​ విజయవాడ: ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఏజెంట్ల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు మార్కండేయులు హెచ్చరించారు. ఐఆర్డిఏ నూతన నిబంధనలను ఉపసంహరించుకుని ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఏజెంట్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నుండి ఎల్ఐసి ఏజెంట్ల సమస్యలు పరిష్కరించాలని బుధవారం బీసెంట్ రోడ్ ఎల్ఐసి కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు మార్కండేయులు మాట్లాడుతూ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఐఆర్డిఏ(irda) నూతన విధానం వలన అనేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మా సమస్యలను నివేదించామని, అయినా ఇంతవరకు మా డిమాండ్లను నెరవేర్చలేదని వాపోయారు. తమ డిమాండ్లను నెరవేరేవరకు దేశంలోని అన్ని ఎల్ఐసి కార్యాలయాలలో ఎల్ఐసి కార్యకలాపాలను, సమావేశాలని బహిష్కరించామని తెలిపారు. తమ డిమాండ్ల ను నెరవేర్చేవరకు గవర్నమెంట్ ఎల్ఐసి ఏజెంట్లతో పాటు ప్రైవేట్ ఎల్ఐసి ఏజెంట్లను కలుపుకొని ఉద్యమాన్ని ఉద్దతం చేస్తామని హెచ్చరించారు.

About Author