NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లయన్ డా. రాయపాటి శ్రీనివాస్ కు  గ్లోబల్ పీస్ అంబాసిడర్  గా గుర్తింపు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  సామాజిక సేవా  రంగంలో చేస్తున్న సేవలను గుర్తిస్తూ అసోసియేషన్ అలియాన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ మాజీ ఇంటర్నేషనల్ కౌన్సిల్ చైర్ పర్సన్, లయన్స్ జిల్లా మాజీ ఆడిషన్ క్యాబినెట్ సెక్రటరీ,నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా జనరల్ సెక్రెటరీ, యునైటెడ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్  లీగల్ రైట్స్ ఫౌండేషన్ స్టేట్ చైర్మన్ , నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ  అధ్యక్షులు  లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కు సిలోయం టబర్నకల్  థియోలాజికల్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్  అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ పీస్ అంబాసిడర్ గా గుర్తింపు గౌరవం నేడు అంతర్జాలంలో జరిగిన సమావేశంలో ఆర్క్ బిషప్   జ్ఞానకరన్ ఏసయ్య ,హెచ్ ఈ అంబాసిడర్  ఎమెరిటస్   ప్రొఫెసర్  ఒబెంగ్ ఎలిజా  కిర్కాఫ్ లు  అందజేశారు. విద్యా, మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగ సేవలు, సీనియర్ సిటిజన్ సంక్షేమం, న్యాయ అవగాహన శిబిరాలు, రక్తదానం, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం, పేదలకు దుస్తుల పంపిణీ, పర్యావరణ పరిరక్షణ,సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా యువతను ప్రోత్సహించడం,యువతలో లో లీడర్షిప్ క్వాలిటీను పెంచడానికి  నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం, యువతకు మహిళలకు వృత్తి విద్యలపై శిక్షణ అందించడం లాంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా కరోనా సమయంలో సేవా కార్యక్రమాలను నిర్వహించడం లాంటి కార్యక్రమాలకు గుర్తింపు ఈ పురస్కారం లభించడం గర్వకారణమని ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ సభ్యులు అభినందనలు తెలియజేశారు.

About Author