లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కు గౌరవ హానరరీ ప్రొఫెసర్ గా గుర్తింపు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: రిపబ్లిక్ ఆఫ్ ఇరాక్ దేశానికి చెందిన విక్టోరియా యూనివర్సిటీ ఆఫ్ కల్చర్ అండ్ వరల్డ్ పీస్ నుంచి సామాజిక సేవా రంగంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం ,న్యాయ విజ్ఞాన శిబిరాలు నిర్వహించడం ,మానవ హక్కుల అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం తదిత రంగాలలో గత 35 సంవత్సరాలుగా చేసిన విశేష కృషికి గాను నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు లయన్ అంబాసిడర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కు విక్టోరియా యూనివర్సిటీ ఆఫ్ కల్చర్ అండ వరల్ విశ్వవిద్యాలయ వ్యవస్థాపక ఛాన్స్లర్ డాక్టర్ ప్రొఫెసర్ ముస్తఫా దిసౌకి , వైస్ ఛాన్స్లర్ డాక్టర్ రానియా అల్ షేక్, సెక్రటరీ జనరల్ డాక్టర్ సాకిరత్ అల్మహబ్బేర్లు అంతర్జాలం ద్వారా గౌరవ హానరరీ ప్రొఫెసర్ గుర్తింపు సర్టిఫికెట్ ను అందజేశారు .ఈ సందర్భంగా లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ విక్టోరియా యూనివర్సిటీ ఆఫ్ కల్చరల్ అండ్ వరల్డ్ పీస్ ప్రతినిధులకు లకు ధన్యవాదాలు తెలిపారు.