కుష్టు రోగులకు జీవనోపాధి అద్భుతం
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: కుష్టు రోగులు జీవనోపాదులతో ప్రతి ఒక్కరూ ఇతరులతో పాటుగా తమ జీవితాలను ముందుకు తీసుకుపోవాలని ప్రోగ్రాం కోఆర్డినేటర్ సిస్టర్ దీప్తి అన్నారు.కర్నూలు మండల పరిధిలోని వెంకాయ్య పల్లె విమల ప్రొవిన్షియల్ హౌస్ ఆధ్వర్యంలో కేరళ రాష్ట్రంలో ఉన్న సేవ్ ఏ ఫ్యామిలీ ఆనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో డోన్ లో కుష్టు రోగులకు 41 కుటుంబాలకు డోన్ మరియు కర్నూలు లెప్రసీ కాలనీలో ఉన్న వారికి జీవనోపాధిని కల్పించారు.టీ షాప్,బైక్ మెకానిక్, బట్టల షాపు కుట్టు కేంద్రం సౌండ్ సిస్టం జనరల్ స్టోర్ మొదలగ షాపులను వారికి ఉపాధిని కల్పించినట్లు సిస్టర్ దీప్తి తెలిపారు. వీరందరికీ కూడా ప్రతి ఒక్కరికి 65 వేల నుండి 75 వేల రూపాయలు ఈ ఉపాధికి సహకారం అందించినట్లు ఆమె తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డోన్ లెప్రసీ,ఎయిడ్స్,టీబి అధికారి డాక్టర్.శారద మాట్లాడుతూ మీకు సంస్థ పారు ముందుకు వచ్చి మీకు జీవనోపాధిని కల్పించడం చాలా సంతోషించదగ్గ విషయమని సంస్థను డాక్టర్ అభినందించారు.వారు చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని అదేవిధంగా వారు చెప్పిన విధంగా మీరు నడుచుకుంటే మీ జీవితాలను బాగు చేసుకోవచ్చని మీకు జీవనోపాధిని కల్పించారు కాబట్టి ఎవ్వరూ కూడా బిక్షాటన చేయడం మంచి పద్ధతి కాదని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సిస్టర్ సారంగ,మెడికల్ ఆఫీసర్ వి.రామ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.