NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆదోనిలో ఘనంగా అంగన్వాడీ ఉత్సవాలు

1 min read

బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం ప్రాముఖ్యతపై అవగాహన

ఆదోని, న్యూస్ టుడే :   ఆదోని పట్టణంలో మంగళవారం అంగన్వాడీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ 9వ వార్డు పరిధిలోని పింజారి వీధి, సదాశివపేట, దండుగేరి ప్రాంతాల్లోని హెడ్ క్వార్టర్స్ పరిధిలో గోకారి జెండా సెంటర్ నంబర్ 14, 15, 16 కేంద్రాల్లో ఈ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి  ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ దిల్లీశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, 0 నుంచి 6 సంవత్సరాల లోపు చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న బాల సంజీవిని, పౌష్టికాహారం, గుడ్లు, పాలు యొక్క ప్రాముఖ్యతను వివరించారు. పౌష్టికాహార లోపం వల్ల వచ్చే వ్యాధులను ఎలా నివారించవచ్చో తల్లులకు అవగాహన కల్పించారు. తమ వార్డుకు వచ్చి పౌష్టికాహారం గురించి చక్కగా వివరించిన సీడీపీఓ దిల్లీశ్వరి, ఐసీడీఎస్ అధికారులకు స్థానిక ప్రజలు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి  సీనియర్ నాయకులు జయరామ్, హెచ్ఎం ఝాన్సీ, అంగన్వాడీ సూపర్ వైజర్లు, కార్యకర్తలు లక్ష్మీ, సరస్వతి, పద్మ మరియు స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *