కేరళలో లాక్ డౌన్.. వైద్య బృందం పంపుతున్న కేంద్రం
1 min readపల్లెవెలుగు వెబ్ : కేరళ రాష్ట్రంలో కరోన విజృంభిస్తోంది. అక్కడ కేసుల నమోదు ఆందోళనకర స్థాయిలో ఉంది. ప్రతి రోజు 20 వేల పైన కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం వారాంతపు లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి ఆంక్షలు అమల్లోకి వస్తాయి. కోవిడ్ పరిస్థితిని అంచనా వేసేందుకు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కు చెందిన ఆరుగురు సభ్యుల బృందాన్ని కేంద్ర ప్రభుత్వం కేరళకు పంపుతోంది. కేరళలో భారీగా కరోన కేసులు నమోదు అవుతున్నాయని, అక్కడ ప్రభుత్వానికి ఈ బృందం అండగా ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్ సుఖ్ మాండవియ ప్రకటించారు.