PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లొద్దిపల్లి అల్లా బకాష్ కు కర్నూలు రంగస్థలం అశ్రునివాళి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  సత్య హరిచంద్ర పాత్ర వేదికపై ప్రదర్శన జరిగిందంటే కన్నీరు కార్చని హృదయం ఉండదు, కళను కన్నీటితో ముడిపెట్టించిన ముగ్ద మనోహర రూప శిల్పం స్వర్గీయ లొద్దిపల్లి అల్లా బకాష్, ఉభయ ఆంధ్రప్రదేశ్ రంగస్థల కళాకారులు సత్య హరిచంద్ర పాత్ర అభిమానులు లొద్దిపల్లి అల్లా బాకాష్ అభినయానికి స్పందించని హృదయం కటోరమని అనుకునే నటన యశస్వి లొద్దిపల్లి అల్లా బకష్ ఆయన అభినయానికి మెచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ అవార్డును ప్రధానం చేసింది. వృత్తి రీత్యా ఉపాధ్యాయులుగా కొనసాగుతూ ప్రవృత్తి రీత్యా రంగస్థల కళాకారుడిగా కొనసాగుతూ రంగస్థల నాటకం పై గల మక్కువతో సత్యహరిచంద్ర పాత్రను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 1500 వేదికలపై హరిచంద్ర పాత్రను పోషించిన ఏకైక నట యశస్వి నటదిగ్గజం రాయలసీమ కళారత్నం లొద్దిపల్లి అల్లా బకాష్. జిల్లా ప్రభుత్వ అధికారులు ఆయన నటనను వేదికపై చూసి కన్నీరు కార్చి శభాష్ హరిచంద్ర నాటకంలో మీరు జీవిస్తున్న తీరు అమోఘమని ఎందరో జిల్లా అధికారులు అభినందించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రశంశాలతో పాటు అనేక కళా సమాజాల ప్రశంసలు పొందిన మహనీయ మహానటులు, నటి సీతారామమ్మ తో హరిచంద్ర పాత్రలో ఒదిగి చంద్రమతి తో ఆయన చేసిన కమనీయ రంగస్థల దృశ్యాలు సహజంగా వాస్తవ దృశ్యాలుగా కర్నూలు కళాకారులు నేటికీ భావిస్తున్నారు, అసమాన నటనతో రాణిస్తూ సత్య హరిశ్చంద్రుని పాత్రలో ఒదిగి సత్యానికి ప్రతీకగా జీవితాన్ని మలుచుకొని ఎందరో రంగస్థలం కళాకారులకు స్ఫూర్తి ప్రదాత వారే లబ్దిపల్లి అల్లా బాకష్ కర్నూలు జిల్లా ప్రధాన వేదికలపై ప్రశంసల జల్లు పల్లె పల్లెల్లో గ్రామ గ్రామాల్లో ఆయన ప్రదర్శన అంటే కేరింతలతో అభిమానులు ఈలలు కేకలు నటసార్వభౌమునికి జేజేలు పలికారు ఆనాటి అభిమానులు, మంచి ఉపాధ్యాయుడుగా మంచి మనిషిగా మంచి నటుడిగా రాష్ట్రస్థాయి గుర్తింపు పొంది కర్నూలు జిల్లా రంగస్థల చంద్రహారమై నిలిచారు వారి కీర్తి నభూతో నా భవిష్యత్తు మహానుభావా మళ్లీ ఎప్పుడు పుడతావని ప్రేక్షక లోకం నీకోసం ఎదురు చూస్తూ, వీరి ఏకైక కుమారులు బిఎస్ఎన్ఎల్ అధికారి ఎండి హుస్సేన్ భాష కుటుంబ సభ్యులతో  కర్నూలు జిల్లా రంగస్థలం కన్నీరు కారుస్తూ, నీకు అశ్రు నయనాలతో వీడ్కోలు పలుకుతూ అల్లా బకాశ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ వారి కుటుంబానికి కుటుంబ సభ్యులకు సంతాపం ఆ దేవదేవుని సన్నిధిలో స్వర్గ ప్రాప్తి కలగాలని కర్నూలు కళామతల్లి ముద్దుబిడ్డ అమరజీవి లద్దిపల్లి అల్లా బాకాశ్ గకి కర్నూలు కళాభిషేకం, హనుమాన్ కళా సమితి అధ్యక్షుడు  హనుమంతరావు చౌదరి బైలుప్పల షఫీయు ల్లాజి అంకయ్య,సయ్యద్ రోషన్ అలీ ,అజయ్ కుమార్,వివి రమణారెడ్డిఎం మనోహర్ బాబు, ఎం రామలింగం, వివి రమణ చారి,ఎం బీసన్న  కళా ప్రియ తిరుపాలు పి దస్తగిరి డి పుల్లయ్య అరుణ కుమారి రమణాచారి రాజశేఖర్ రావు రామకృష్ణ ,భాస్కర్ ,టీవీ రెడ్డి రాధిక, శ్రీనివాసులు , చిన్నికృష్ణ ,షేక్షావలి ,కర్నూలు జిల్లా లొద్దిపల్లి అల్లా బాకష్ అభిమానులు రంగస్థల కళాకారుల కన్నీటి వేడుకోలు, ప్రగాఢ సానుభూతి, వ్యక్తం చేస్తున్నారు.

About Author