గిరిజనులు పట్టాలకై కలెక్టర్ ను నివేదిక కోరిన రాష్ట్ర లోకాయుక్త
1 min read– పి లక్ష్మణ రెడ్డి.
పల్లెవెలుగు వెబ్ ఉయ్యూరు: అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం కోనాం రెవెన్యూ గ్రామంలో 20 మంది గిరిజనులకు సాగుభూమి పట్టాలకై మంజూరు విషయమై అనకాపల్లి జిల్లా కలెక్టర్ ను నివేదిక కోరిన రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ పి .లక్ష్మణ రెడ్డిఅని, సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం కోనాం రెవెన్యూ గ్రామంలో సర్వే నంబర్ 312 .1 జి ,312 .1 ఎప్, లోని31.50సెంట్లు 20 మంది గిరిజనులకు రెవెన్యూ అధికారులు పట్టాలు మంజూరు చేయు విషయమై రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ లక్ష్మాణరెడ్డి అనకాపల్లి జిల్లా కలెక్టర్కు నివేదిక కోరుతూ ఉత్తర్వులు జారీ చేశారు .కృష్ణా జిల్లా ఉయ్యూరు కు చెందిన సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ ఈనెల 1వ తేదీన రాష్ట్ర లోకాయుక్తకు చేసిన ఫిర్యాదు మేరకు పై ఉత్తర్వులు జారీ చేశారు. ఈ గిరిజనులు సాగు భూమి పట్టాలకై గత సంవత్సరాలుగా భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి (అనకాపల్లి)పి.ఎస్ .అజయ్ కుమార్ పోరాటం చేస్తున్నారు. షెడ్యూల్ తెగలకు చెందిన కొండ దొర కులానికి చెందిన పతంగి పేరయ్య ,కసుబోయిన కన్నబాబు, ఉయాబోయిన సన్నిబాబు, మొదలగు 20 మంది గిరిజనులు తరతరాలుగా సాగు చేసుకుంటున్నప్పటికీ చీడికాడ మండల రెవెన్యూ అధికారులు సాగు అనుభవాన్ని నమోదును ఉద్దేశ్యపూర్వకంగా చేయనందున ,కోనాం రెవెన్యూ గ్రామంలోని 312 -1జి, 312-1 ఎఫ్ , సాగులో ఉన్న 20 మంది గిరిజనుల కు రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి మెమో నెం.రెవొం5-19 /1/ 2022-1 సెక్షన్- సి ఎస్ ల్ ది. మార్చి 2022 సం..రం ప్రకారం సాగుదారుల పేర్లు నమోదు చేసి వారికి పట్టాలు, పాసుపుస్తకాలు, జారీ చేయడానికి అనకాపల్లి జిల్లా కలెక్టర్ ,నర్సీపట్నం ఆర్.డి.ఓ, తగు చర్యలు తీసుకోగలందులకు ,జస్టిస్ పి. లక్ష్మణరెడ్డి కి ఫిర్యాదు చేయడం జరిగింది. అని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ ప్రకటనలో తెలియజేశారు.