NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లోకేష్ పాదయాత్ర విజయవంతం కావాలి

1 min read

– మసీదులో ప్రత్యేక ప్రార్థనలు
– ఈ ప్రభుత్వాన్ని తరిమికొట్టండి -ఇదేం కర్మలో కాకరవాడ చిన్న వెంకటస్వామి
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మండల పరిధిలోని ఉప్పలదడియ గ్రామంలో ఉన్న మసీదులో నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర విజయం కావాలని అదేవిధంగా నందమూరి తారకరత్న ఆరోగ్యం కుదుటపడాలని టిడిపి మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో నందికొట్కూరు టిడిపి అధికార ప్రతినిధి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి మరియు మైనారిటీ నాయకులు ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించారు.తర్వాత ఉప్పలదడియ గ్రామంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు.గ్రామంలో ఉన్న ఇంటింటికి వెళ్లి ఇదేం కర్మ పత్రాలను ప్రజలకు అందజేస్తూ ప్రభుత్వ అవలంబిస్తున్న విధానాల పట్ల,గత ప్రభుత్వానికి ఈప్రభుత్వానికి నిత్యవసర సరుకుల ధరలు ఏవిధంగా ఉన్నాయనే వాటి గురించి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి,ఖాతా రమేష్ రెడ్డి వివరించారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేస్తే ఎలాంటి షరతులు లేకుండా పథకం వర్తించేదని కానీ ఇప్పుడిప్పుడే తీసుకు వచ్చినటువంటి ఈపథకానికి ఎన్నో షరతులు పెట్టడం దారుణమని అన్నారు.రాబోయే రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఉద్యోగాలు రావాలన్న టిడిపి ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు.ఈరాక్షస ప్రభుత్వాన్ని తరిమికొట్టడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలని వారు ప్రజలకు వివరించారు.ఈకార్యక్రమంలో గ్రామ టిడిపి నాయకులు సర్వోత్తమ్ రెడ్డి,ఉప్పలదడియ టిడిపి నాయకులు మరియు నంద్యాల జిల్లా టిడిపి మైనారిటీ కార్యదర్శి సుల్తాన్,టిడిపి మైనారిటీ మండల అధ్యక్షులు మొల్ల చాకర్ వలి,వివిధ గ్రామాల నాయకులు శాలుమియా,జాకీర్ హుస్సేన్, గోకారి,అబ్దుల్ రహమాన్,ముర్తుజావలి,ఖాజామియ్య,బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author