NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

థియేట‌ర్ల ప‌రిస్థితి చూస్తే ఏడుపొస్తోంది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : థియేట‌ర్ల ప‌రిస్థితి త‌ల‌చుకుంటే ఏడుపొస్తుంద‌ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఆర్. నారాయ‌ణ‌మూర్తి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఉత్త‌రాంధ్ర‌లో కొన్ని థియేట‌ర్లు మూసివేశార‌ని వార్త‌లు వ‌స్తే.. ఏడుపొస్తోంద‌ని, సినిమా తీసేవాడు, చూపించేవాడు, చూసేవాడు బాగుంట‌నే ఇండ‌స్ట్రీ బాగుంటుంద‌ని అన్నారు. ఇండస్ట్రీ పై ఆధార‌ప‌డి కోట్లాది మంది బ‌తుకుతున్నార‌ని అన్నారు. థియేట‌ర్ య‌జ‌మానులు థియేట‌ర్ ను మూసివేయొద్ద‌ని కోరారు. స్థానికంగా ఉన్న మంత్రుల్ని క‌లిసి, స‌మ‌స్య‌ను సీఎం దృష్టికి తీసుకెళ్లాల‌ని సినిమా పెద్ద‌ల్ని కోరారు. స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపాల‌ని ఏపీ ప్ర‌భుత్వాన్ని నారాయ‌ణ‌మూర్తి కోరారు.

                                      

About Author