నష్టపోయిన పత్తి రైతులకు ..నష్ట పరిహారం ఇవ్వాలి
1 min readపల్లెవెలుగు, వెబ్ మిడుతూరు: సోమవారం నాడు ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని మిడుతూరు మండలంలోపత్తి పంటను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా నాయకులుP వెంకటేశ్వర్లు సిఐటియు జిల్లా నాయకులు కే భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో రైతులు నంద్యాల జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వేలాది ఎకరాలు పత్తి పంటలు సాగు చేశారని కల్తీ విత్తనాల వేయడంతో పంట దిగుబడి రాక అప్పుల పాలు అవ్వడం జరుగుతుందన్నారు కల్తీ విత్తనాల పైన అధికారులు జోక్యం చేసుకో క పోవడంతో విచ్చలవిడిగా విత్తనాలు అమ్మి రైతులకు మోసం చేస్తున్నారన్నారు జిల్లా అధికారులు నకిలీ విత్తనాల ప్రైవేటు కంపెనీల పైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు వీటికి తోడు కౌలు రైతులు కూడా భూమిని కౌలుకు తీసుకొని పెట్టుబడి పెట్టి కౌలు గుర్తింపు కార్డు లేక బ్యాంకు రుణాలు రాక ఈ క్రాప్ లో పంట నమోదు లేక పంటలు నష్టపోవడం జరుగుతుందన్నారు అతివృష్టి అనావృష్టి వల్ల భారీ వర్షాల వల్ల దోమ కాటుతో పత్తి ఎర్ర తెగులుతో పూత కాయలు రాలిపోవడం జరుగుతుందన్నారు దీనికి తోడు నాణ్యమైన విత్తనాలు లేక నకిలీ విత్తనాలతో పంట ఏపుగా పెరిగి దిగుబడి రావడం లేదన్నారు అందువల్ల తక్షణమే పత్తి పంటలను శాస్త్రవేత్తలతో పరిశీలించి నష్టపరిహారం చెల్లించాలన్నారు లేకపోతే పత్తి రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు V రామకృష్ణ సిఐటియు నాయకులు గోపాలకృష్ణ పాల్గొన్నారు.