NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యోగాంధ్రలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి

1 min read

నగరపాలక మేనేజర్ యన్.చిన్నరాముడు

కర్నూలు, న్యూస నేడు: సోమవారం  కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన మోగాంధ్ర‌ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని నగరపాలక మేనేజర్ యన్.చిన్నరాముడు కోరారు. సోమవారం ఖానా ఖజానా వద్ద ‘స్ట్రీట్ యోగ’ ఆసనాల శిక్షణలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ మోగా శిక్షణ ఉచితంగా పొంది, తమ రోజువారీ జీవితంలో యోగాను అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. మంగళవారం ఔట్‌డోర్ స్టేడియం మైదానంలో నిర్వహించనున్న సాముహిక యోగా ప్రదర్శనలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కోరారు.కార్యక్రమంలో టీజీవి కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, జెంటిల్మెన్ వాకర్, అసోసియేషన్ సభ్యులు కెవి రమణ, సీవీ రెడ్డి, సత్యం, డాక్టర్ రాజశేఖర్, నాగ్ అరుణ్, బిఎస్ఎన్ఎల్ రమణ, వేణు, కే.శివయ్య, తదితరులు పాల్గొన్నారు.

About Author