వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతములు
1 min read
పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో వరలక్ష్మి వ్రతాలు చంద్రవతి కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకు ఆలయ అర్చకులు శాస్త్రొక్తంగా నిర్వహించారు ఈ వ్రత కార్యక్రమంలో. ఈవో లవన్నదంపతులు మరియు శ్రీశైలగ్రామ మహిళలు1000మందికిపైగా మత్తైదువులు వరలక్ష్మిపూజ కార్యక్రమంలోపాల్గొన్నారు.వేదికపై వేంచేబు చేయించిన శ్రీస్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగాఆలయ అర్చక వేద పండితులు తొలుత గణపతి పూజ, వరలక్ష్మీ వ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారి అవాహన కళశస్థాపనతో షోడశోపచార క్రతువులను జరిపించారు. వ్రతంలో పాల్గొన్న వారందరికీ స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించారు. అనంతరం అమ్మవారి రవిక, గాజులు శేష వస్త్రాలుతీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు ఆలయ అధికారులు పాల్గొన్నారు.
