PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహాత్మాజ్యోతిరావు పూలే గొప్ప సాంఘిక విప్లవకారుడు: కురువ సంఘం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగరం లోని బిర్లా గేటు దగ్గర ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని మంగళవారం కర్నూలు జిల్లా కురువ సంఘం నాయకులు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు .ఈ సందర్బంగా జిల్లా కురువ సంఘం ప్రధానకార్యదర్శి ఎం.కే .రంగస్వామి మాట్లాడుతూ మహాత్మాజ్యోతిరావు పూలే గొప్ప సాంఘిక విప్లవకారుడు ,అట్టడుగు వర్గాల వారి కోసం నిస్సహాయస్థితి లో ఉన్న స్త్రీల గురించి ఆలోచించి ,మహిళల విద్య కోసం కృషి చేసిన మహనీయులు అని పేర్కొన్నారు .వారి ఆలోచనలను ఆదర్శంగా తీసుకొని ,వారి ఆశయాల సాధనకోసం కృషి చేద్దామని తెలిపారు .ఈ కార్యక్రమం లో జిల్లా కోశాధికారి కే . సి .నాగన్న ,బి .సి .తిరుపాల్ ,నగర కురువ సంఘం అధ్యక్ష ,కార్యదర్శి తవుడు శ్రీనివాసులు ,బి .రామకృష్ణ ,తదితరులు పాల్గొన్నారు .

బిర్లా గేటు, మంగళవారం, విద్య, కృషి,

About Author