NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మ‌హేష్ బాబు సోద‌రుడు ర‌మేష్ బాబు మృతి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు సోద‌రుడు, కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు తుదిశ్వాస విడిచారు. గ‌త రాత్రి 10 గంట‌ల స‌మ‌యంలో కాలేయ సంబంధిత వ్యాధితో బాధ‌పడుతున్న ర‌మేష్ బాబు మ‌ర‌ణించిన‌ట్టు వైద్యులు తెలిపారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పతికి తరలించారు. అయితే అప్పటికే రమేశ్‌బాబు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 1965, అక్టోబర్‌ 13న చెన్నైలో కృష్ణ, ఇందిరలకు మొదటి సంతానంగా ర‌మేష్ బాబు జన్మించారు. తండ్రి కృష్ణ హీరోగా నటించిన ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాలో చిన్నప్పటి సీతారామరాజుగా తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత కృష్ణ ఓ లీడ్‌ రోల్‌లో నటించి, నిర్మించిన ‘దేవుడు చేసిన మనుషులు’లో చిన్నప్పటి ఎన్టీఆర్‌గా కనిపించారు. ‘దొంగలకు దొంగ, అన్నదమ్ముల సవాల్‌’వంటి చిత్రాల్లో బాల నటుడిగా అలరించారు. రమేష్ బాబు మ‌ర‌ణం ప‌ట్ల సినిమా ఇండ‌స్ట్రీ దిగ్బ్రాంతికి గురయింది. జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ర‌మేష్ బాబు మృతికి సంతాపం ప్ర‌క‌టించారు.

                                                   

About Author