PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైఎస్ఆర్సిపి లో భారీగా టిడిపి మైనార్టీ నాయకులు చేరిక

1 min read

– పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: మైనార్టీ కాలనికి చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ మహబూబ్ బాషా, ఖుదమ గారి మహబూబ్ షేక్, షేక్ సలీం, వీరికి చెందిన 15 కుటుంబాలు గురువారం రాత్రి కడప వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సిపి పార్టీలో చేరారు, వీరిని ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి పార్టీ కండువా వేసి సాధారణంగా పార్టీలోనికి ఆహ్వానించారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై భారీ ఎత్తున పార్టీలో చేరడం జరుగుతుందన్నారు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి, మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా అనేక సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగింది అన్నారు, ఆయన తనయులు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి, మైనార్టీల పక్షపాతిగా వారికి అనేక రకాలుగా పథకాలు అందించడమే కాకుండా వారి అభ్యున్నతికి పెద్దపీట వేయడం జరిగిందన్నారు, గత ప్రభుత్వ హయాంలో మైనార్టీలకు ఒక మంత్రి పదవి కూడా ఇచ్చిన దాఖలాలు లేవని , నేడు వారికి అత్యున్నత స్థానం కల్పించడం జరుగుతుందని తెలిపారు, అనంతరం వైయస్సార్ సిపి మండల కన్వీనర్ జీఎన్, భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, సౌమ్యుడు మృదు స్వభావి శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, మైనార్టీలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడం, అదేవిధంగా వారి అభ్యున్నతికి పాటుపడటంతో మైనార్టీలందరూ కూడా వైఎస్ఆర్సిపి పై ధీమాతో, కమలాపురం శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి పై నమ్మకంతో పార్టీలో చేరడం జరుగుతుందని ఆయన తెలియజేశారు, అంతేకాకుండా మరో వారం లోపల చెన్నూరు మైనార్టీ కాలనీ నుండి తెలుగుదేశం సంబంధించిన మైనార్టీలు భారీ ఎత్తున పార్టీలో చేరబోతున్నారని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు, అందరూ కలిసికట్టుగా పనిచేసే కమలాపురం నియోజకవర్గంలో భారీ మెజారిటీతో వైఎస్ఆర్సిపి జెండా ఎగరవేయడం ఖాయమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు, ఈ కార్యక్రమంలో ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, వైఎస్ఆర్సిపి టౌన్ కన్వీనర్ ముదిరెడ్డి సుబ్బారెడ్డి, ఎంపీటీసీ సాధక్ అలీ, మండల వైస్ చైర్మన్ ఆర్ ఎస్ ఆర్ , మైనారిటీ నాయకులు హస్రత్, తదితరులు పాల్గొన్నారు.

About Author