PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మకర సంక్రాంతి .. రామాపురంలో సీతారామ కళ్యాణం

1 min read

పల్లెవెలుగు వెబ్ కమలాపురం : నిత్య కళ్యాణ దేవత మూర్తులు శ్రీ మహాలక్ష్మి మోక్ష నారాయణ స్వామి శ్రీ వల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువైన శ్రీ రామాపూరం పుణ్యక్షేత్రంలో సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలం సందర్భంగా ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు సీతారామ కళ్యాణం నిర్వహిస్తున్నారు.. ఆలయ స్థల చరిత్ర ప్రకారం ఉత్తరాయణ పుణ్యకాలం సందర్భంగా శ్రీరాముల వారు లంకలో రావణ సంహారం అనంతరం అయోధ్యకు తిరుగు పయనం లో సీతాదేవి జాంభ వంతుడు ఆయన సైన్యం తో రామాపురం ప్రాంతానికి విచ్చేసి ఇక్కడ నిధురించాడని స్థల చరిత్ర చెపుతోంది. శ్రీ రాముల వారు ఈ క్షేత్రంలో ఉత్తరాయణ పుణ్యకాలం లో నిదురిస్తున్న సమయం లో శ్రీ మహ విష్ణువు శ్రీరాముల వారికి స్వప్న సాక్షాత్కారమై మోక్షాన్ని ప్రసాదించాడని అలాగే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఈ భువిలో ఎక్కడా లేని విధంగా విశ్వరూపం లొ ఉండేలా శ్రీరాముల వారు ప్రార్థించారని శ్రీ రాములవారి అభీష్ట మేరకు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఇక్కడ ద్వి కందరుడుగా వెలిసినట్లు స్థల పురాణం పేర్కొంటుంది. 2000 సంవత్సరాల క్రితం నాటి ఆలయం భిన్నమైన తర్వాత ఇటీవల గత ఎనిమిది సంవత్సరాల కిందట ఆలయ దేవత మూర్తుల పునః ప్రతిష్ట అనంతరం అయోధ్య నుంచి సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారు ఉత్తరాయణ పుణ్యకాలంలో రామాపరం క్షేత్రానికి ఉత్సవ విగ్రహలు గా ఆలయం పున ప్రతిష్ట జరిగిన మొదటి సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం సమయంలో రామాపుర క్షేత్రానికి రావడంతో స్టల చరిత్ర కు మరింత బలం చేకూరింది అప్పటినుంచి ప్రతి సంవత్సరం ఉత్తరాయన పుణ్యకాలం ప్రారంభం రోజున సాయం సమయంలో సీతారామ కళ్యాణం అత్యంత వైభవంగా కనుల పండువగ ఈ క్షేత్రంలో నిర్వహిస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయ ప్రధాన సేవకులు కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ ఆధ్వర్యంలో కల్యాణ నిర్వహణ ఏర్పాట్లు ఆలయ కమిటీ సేవకులు నిర్వహిస్తున్నారు కళ్యాణోత్సవానికి భక్తులు విరివిగా తరలిరావాలని ఆలయ కమిటీ సేవకులు కోరుతున్నారు.

About Author