ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టండి
1 min read– ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్
పల్లెవెలుగు వెబ్ ఆదోని: మార్చి 13వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పేర్కొన్నారు. గురువారం ఆదోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్ నందు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ మరియు స్ట్రాంగ్ రూమ్ పరిశీలించారు. సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ… పటిష్టమైన భద్రత, బారికేడ్లు, విద్యుత్, ఫర్నిచర్, ఏర్పాటు చేయాలన్నారు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఆదేశించారు.ఆదోని డివిజన్ వారిగా పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలు 19, మరియు ఉపాధ్యాయుల పోలింగ్ కేంద్రాలు 09 , స్థానిక ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రం 01 డివిజన్ వారిగా పట్టభద్రుల ఓటర్స్ 17, 341మరియు 1,261 ఉపాధ్యాయుల ఓటర్స్ మరియు 259 స్థానిక ఎమ్మెల్సీ ఓటర్స్ ఉన్నారన్నారు.ఈ కార్యక్రమానికి ఆదోని తాసిల్దార్ వెంకటలక్ష్మి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.