PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భారతదేశాన్ని 2047 సంవత్సరానికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చండి

1 min read

– ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ…

– ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ భారత దేశ ప్రజలను ఉద్దేశించి ఢిల్లీ ప్రగతి మైదానం భారత మండపం నుండి మాట్లాడుతూ 2047 సంవత్సరానికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని విజ్ఞప్తి చేశారు.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  శనివారం ఉదయం ఢిల్లీ ప్రగతి మైదాన్ భారత మండపం లో దేశంలోని వివిధ ప్రదేశాల నుండి వచ్చిన అధికారులు,స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల మధ్య  సంకల్ప సప్త కార్యక్రమం ను ప్రారంభించారు అక్టోబర్ 3 నుండి 9 వరకు జరుగు విధంగా కార్యక్రమాన్ని రూపొందించినారు. మొదటగా ప్రధానమంత్రి దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు చేసిన వివిధ ప్రజా ఉపయోగకర విషయాల స్టాళ్లను పరిశీలించి వారితో మాట్లాడి విషయాలు తెలుసుకున్నారు. తరువాత జమ్ము కాశ్మీర్ ,ఉత్తర ప్రదేశ్  మరియ మేఘాలయ కు చెందిన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారిని ఆ ప్రదేశంలో చేయవలసిన అభివృద్ధి పనులు గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. వారు చేస్తున్న సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు.ప్రధానమంత్రి భారత్ మండపంలో ఉన్న నీతి ఆయోగ్ అధికారులు , దేశం నలుమూల నుండి వచ్చిన అధికార మరియు ప్రజాప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇప్పుడు మనమున్న భారత మండపంలో కొన్ని రోజుల కిందట ప్రపంచంలోని దేశాధినేతలు G20 సదస్సు ద్వారా ప్రపంచాన్ని అభివృద్ధి చేయడానికి తీసుకోవలసిన చర్యల గురించి చర్చించడం జరిగింది .ఇప్పుడు అదే ప్రదేశంలో మన భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి కావలసిన వనరులు , అవసరాలు మెదలగు వాటిని గుర్తించి మనము మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. భారతదేశంలో ఉన్న ముఖ్య ప్రదేశాలు ఢిల్లీ , ముంబాయి , హైదరాబాదు , కలకత్తా, చెన్నై మొదలగు ప్రదేశాలు అభివృద్ధి చెందిన అంత మాత్రాన భారతదేశ అభివృద్ధి చెందినట్లు కాదని , భారత దేశంలోని ప్రతి గ్రామము , గ్రామంలో ఉన్న అందరూ అభివృద్ధి చెందినప్పుడే భారత దేశము అభివృద్ధి చెందినట్లు అని తెలిపారు. కావున మీరు భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి కావలసిన చర్యలను చేపట్టాలని కోరారు. అందుకుగాను మీరందరూ ప్రతి గ్రామంలో కావలసిన అవసరాలు గుర్తించాలి గుర్తించిన పిమ్మట అందులో ఉన్న లోటుపాట్లను గ్రహించి వాటిని సరిచేయడానికి కావలసిన చర్యలు తీసుకోవాలని తద్వారా గ్రామం అభివృద్ధి చెందుతుంది , బ్లాక్ అభివృద్ధి చెందుతుంది , ఆ విధంగా దేశము అభివృద్ధి చెందుతుందని తెలిపారు. దేశంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు వెనుకబడ్డ 100 బ్లాకులను ఎన్నుకొని  వాటి లోని ప్రతి గ్రామానికి కావలసిన అవసరాలు గుర్తించాలి. గుర్తించిన అవసరాలను ప్రభుత్వం ద్వారా , స్వచ్ఛంద సంస్థల ద్వారా మరియ విదేశాల్లో ఉన్న భారతీయుల ద్వారా ఆ గ్రామ అభివృద్ధికి వారందరినీ భాగస్వాములు చేసి గ్రామంలో ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందేలాగా చర్యలు తీసుకోవాలని సూచించారు .ఈ విషయంలో ప్రతి గ్రామము వేరే గ్రామంతో పోటీపడాలి , ప్రతి బ్లాక్ మరొక బ్లాక్ తో పోటీపడి అభివృద్ధి దిశగా పయనించాలని సూచించారు. గుజరాత్ రాష్ట్రంలో కచ్ ప్రాంతం లో భూకంపం వచ్చిన తరువాత ఆ ప్రదేశాన్ని అభివృద్ధి చేయటానికి చాలా కష్టపడామని తెలిపారు . ఆ జిల్లాలో సేవలందించడానికి అధికారులను నియమించామంటే దానికి అధికారులు ఎంతో సంతోషించేవారు . ఎందుకంటే అక్కడ పనిచేసిన తర్వాత వారికి అంతకంటే ముఖ్యమైన ప్రదేశంలో పని చేసే అవకాశం వస్తుందని సంతోషపడేవారు .అంటే కష్టతరమైన మరియు అవసరమైన చోట సేవలు అందించడం అనేది ముఖ్యం అని తెలిపారు. ఈ విధంగా గ్రామాలను పోటీపడి అభివృద్ధి చేయగలిగితే 140 కోట్ల భారత దేశ ప్రజలు అభివృద్ధి చెందుతారని ఆ విధంగా మనమందరము కష్టపడి పని చేయాలని , అందుకు గాను దేశ ప్రజలు సహకరించవలసిందిగా కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం లో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన  సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.

About Author