కడుమూరు’లో మగ శవం లభ్యం..
1 min read
మిడుతూరు(నందికొట్కూరు) న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కడుమూరు గ్రామంలో మగ శవం లభ్యమైనట్లు మిడుతూరు ఎస్సై హెచ్ ఓబులేష్ తెలిపారు.ఎస్ఐ మరియు గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు దేవనూరు గ్రామానికి చెందిన మహమ్మద్ మియా(70)ఈయనకు వివాహం కాలేదు మతిస్థిమితం లేకపోవడంతో తిరుగుతూ ఉండేవాడని గత పది రోజుల క్రితం కడుమూరు గ్రామ పొలిమేరలో పీరు సాహెబ్ పేట రోడ్ గనేట్ల దగ్గర మంగలి మద్దమ్మ పొలం వద్ద తిరిగాడుతుండగా నీళ్లు దప్పిగా అయి పొలంలో కుప్ప కూలిపోవడంతో ఎండలు తీవ్రంగా ఉండటం వల్ల ఆయన అక్కడే మరణించాడు.గుర్తుపట్ట లేనంతగా మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్నాయి.శుక్రవారం మధ్యాహ్నం కడుమూరులో గొర్రెల కాపరులు పొలంలో వెళ్తుండగా వారు గమనించి గ్రామ వీఆర్ఏ భూషన్నకు సమాచారం ఇవ్వగా వీఆర్ఏ పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఎస్ఐ మధ్యాహ్నం 1:15 కు ఎస్సై ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.ఎస్సై కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.ఈనెల 20వ తేదీన ఇంటి నుండి వచ్చిన ఆయన కనబడకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

