విద్యుత్ ఘాతానికి వ్యక్తి బలి…
1 min read
పత్తికొండ, న్యూస్ నేడు: విద్యుత్ ఘాతానికి గురై వ్యక్తి బలైన ఘటన మంగళవారం మండలంలోని హోసూర్ గ్రామంలో చోటుచేసుకుంది. కోయిలకొండ రాముడు 58 సo. లు అనే వ్యక్తి ఇంట్లో పని చేసుకుంటుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన మృతితో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి. మృతునికి భార్య కుమారులు ఉన్నారు.