NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మిడుతూర్ లో ఘనంగా..మాండ్ర జన్మదిన వేడుకలు

1 min read

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్​ నేడు : నంద్యాల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి జన్మదిన వేడుకలు మిడుతూరు మండలంలో కాతా రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం మిడుతూరు మండల కేంద్రంలో టీడీపీ పార్టీ కార్యాలయం దగ్గర శివానందరెడ్డి జన్మదిన వేడుకలు కార్యకర్తల సమయంలో కేక్ కట్ చేసి ఒకరికొకరు సంతోషంగా పంచుకున్నారు.కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా సరే అండగా ఉంటూ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తున్న శివానందరెడ్డి కి ప్రజలు జేజేలు కొడుతున్నారని ఆయనకు దేవుడు మంచి ఆయు రారోగ్యం ఇస్తూ నియోజకవర్గాన్ని ముందుకు నడిపించాలని ఖాతా రమేష్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు ఆర్ వెంకటేశ్వర రెడ్డి,నాగేంద్రుడు,సుధాకర్ రెడ్డి,ఇద్రిస్,గోకారి,నరసింహ గౌడ్,షబ్బు,రాముడు,మండల యువ నాయకులు ప్రమోద్ రెడ్డి,ఐటీడీపీ మండల కన్వీనర్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.

About Author