కడప మహానాడు కు బయలుదేరిన మంత్రాలయం తెలుగు తమ్ముళ్లు
1 min read
జెండా ఊపి ప్రారంభించిన టిడిపి యువ నాయకులు రామకృష్ణ రెడ్డి
మంత్రాలయం , న్యూస్ నేడు : స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు సందర్భంగా కడప జరిగే మహానాడు కు మంత్రాలయం నియోజకవర్గం నుండి తెలుగు తమ్ముళ్లు భారీ గా తరలివెళ్లారు. టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం మండల పరిధిలోని మాధవరం గ్రామ టిడిపి కార్యాలయం నుండి టిడిపి సీనియర్ నాయకులు మాధవరం రఘునాథ్ రెడ్డి, యువ నాయకులు రామకృష్ణ రెడ్డి, రాఖేష్ రెడ్డి ఆధ్వర్యంలో జెండా ఊపి ప్రారంభించారు. రెండో రోజు జరిగే మహానాడు కు సుమారు వంద ప్రైవేటు వాహనాల్లో వేయ్యి మంది తెలుగు తమ్ముళ్లు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల తెలుగు తమ్ముళ్లు ఉన్నారు.