కలెక్టర్ కు మళ్లీ పెళ్లి .. !
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీ గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే మళ్లీ పెళ్లి కొడుకు అయ్యారు. కాంతిలాల్ దండే విశాఖ ఏజెన్సీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా అరుకు లోయ సమీపంలోని గిరి గ్రామదర్శినిలో సంప్రదాయ పద్దతిలో కాంతిలాల్ దండే దంపతులు వివాహం చేసుకున్నారు. గిరి గ్రామదర్శిని నిర్వాహకులు, పెదలబుడు సర్పంచ్ దాసుబాబు ఆధ్వర్యంలో పాడేరు ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ పెళ్లి పెద్దగా వ్యవహరిస్తూ ఈ జంటకు వివాహం జరిపించారు. వివాహం అనంతరం గిరి మహిళలు, పెదలబుడు సర్పంచ్ దాసుబాబుతో కలిసి కాంతిలాల్ దండే, ఆయన సతీమణి గౌతమి థింసా నృత్యం చేశారు. ఈ సందర్భంగా కాంతీలాల్ మాట్లాడుతూ.. గిరిజన సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు.