PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ద‌క్షిణాఫ్రికా పార్ల‌మెంట్ లో భారీ అగ్నిప్ర‌మాదం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ద‌క్షిణాఫ్రికా పార్ల‌మెంట్ లో భారీ అగ్నిప్ర‌మాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉద‌యం ఈ ఘ‌ట‌న జ‌రిగింది. పెద్ద ఎత్తున పొగ‌లు రావ‌టం, మంట‌లు ఎగిసిప‌డ‌టం గ‌మ‌నించిన సిబ్బంది వెంట‌నే అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. అగ్నిమాప‌క సిబ్బంది వెంట‌నే మంట‌లార్పే ప్ర‌య‌త్నం చేశారు. నేష‌న‌ల్ అసెంబ్లీ భ‌వ‌నం అగ్నికీల‌ల్లో చిక్కుకుంద‌ని, పైక‌ప్పున‌కు మంట‌లు వ్యాపించాయ‌ని కేప్ టౌన్ ప్ర‌తినిధి ఒక‌రు ఓ వార్తా సంస్థ‌కు తెలిపారు. మంట‌లు అదుపులోకి రాలేద‌ని, వాటి ధాటికి గోడ‌ల‌కు ప‌గుళ్లు వ‌చ్చాయ‌ని చెప్పారు. ఎటువంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేదు. అయితే.. మంటల వ్యాప్తికి కార‌ణం తెలియ‌రాలేదు.

                                          

About Author