అంకిరెడ్డి ఆత్మకు దేవుడు శాంతి ప్రసాదించాలి
1 min readఅంత్య క్రియల్లో పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించిన కమలాపురం ప్రజా నాయకుడు సత్య సాయినాథ్ శర్మ.
పల్లెవెలుగు వెబ్ కమలాపురం : తెలుగు దేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కమలాపురం మండలం సి రాజుపాలెం నాయకుడు సుధా అంకిరెడ్డి ఆత్మకు శాంతిని భగవంతుడు ప్రసాదించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ కోరారు.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం హైదరాబాద్ సన్ షైన్ ఆసుపత్రి నందు మృతి చెందిన అంకిరెడ్డి మృత దేహానికి సాయినాథ్ శర్మ పూల మాల వేసి నివాళులర్పించారు.బుధవారం నాడు రాజుపాలెం గ్రామం లో బుధవారం ఉదయం జరిగిన సుధా అంకిరెడ్డి భూస్థాపిత అంత్య క్రియలో తెలుగు దేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కమలాపురం నియోజక వర్గ ప్రజా నాయకుడు కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ పాల్గోన్నారు. ప్రజా నాయకుడిగా అంకిరెడ్డి అనేకమంది పేద ప్రజానీకానికి సేవ చేసారని ఆయన పేర్కొన్నారు. మాజీ ఎంపిటిసి సభ్యుడిగా సేవ చేసారన్నారు.అంకిరెడ్డి మృతి వారి కుటుంబానితో పాటు అనేకమంది ఆయన అభిమానులకు తీరని లోటన్నారు .ఆయన కుటుంబ సభ్యులు దైర్యంగా ఉండాలన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆయన కుమారులు రాజారెడ్డి, కిషోర్ ఆయన సోదరుడు సుధాకర్ రెడ్డి అంకిరెడ్డిని బ్రతికించుకోవడానికి, లక్షలాది రూపాయలు వెచ్చించి చికిత్స చేపించి చేసిన శ్రమ ప్రశంసనీయమన్నారు. ఈ సందర్భంగా అంకిరెడ్డి కుమారులు కిషోర్ రెడ్డి రాజారెడ్డి ఆయన సోదరుడు సుధాకర్ రెడ్డి లను సాయినాథ్ శర్మ పరామర్శించారు. ఆయనతో పాటు సాయినాథ్ శర్మ అభిమాన నాయకులు రాసుబ్బారెడ్డి నాగేంద్ర రెడ్డి పెద్ధచెప్పలి ఎంపిటిసి నాగరాజ అచారి మాజీ సర్పంచ్ రాయచోటి సుధాకర్ మైనారిటీ నాయకుడు షుకూర్ ఎస్సీ నాయకులు కొవ్వూరు నరసింహులు నామాల రాజ భాస్కర్ నవీన్ తదితరులు భారీగా పాల్గోన్నారు.