NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మేయ‌ర్, ఎమ్మెల్యేల పెళ్లి.. కానీ ఒక్క కండీష‌న్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌కు మేయర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆర్య రాజేంద్ర‌న్ సెప్టెంబర్ 4న తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడనుంది. పెళ్లి కొడుకు బాలస్సేరి ఎమ్మెల్యే కేఎం సచిన్ దేవ్. ఆర్య రాజేంద్రన్ తన పెళ్లికి రావాల్సిందిగా ఫేస్‌బుక్ ద్వారా అందరినీ ఆహ్వానించారు. అయితే.. ఈమె తన పెళ్లికి అతిథులను ఆహ్వానించిన తీరు మాత్రం ఆర్య రాజేంద్రన్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపించేందుకు కారణమైంది. తన పెళ్లికి హాజరయ్యే అతిథులెవరూ బహుమతులు తీసుకురావద్దని ఆమె స్పష్టం చేశారు. తమ పెళ్లికి ఎవరూ బహుమతులు తీసుకురావొద్దని.. గిఫ్ట్ ఇవ్వాలని భావించే వాళ్లు ఆ డబ్బును వృద్ధాశ్రమాలకు, సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా అందించాలని మేయర్ ఆర్య రాజేంద్రన్ అభ్యర్థించారు. ఈమె చేసిన ఈ ఒక్క సూచనతో నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురిసింది.

                                             

About Author