PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

104 ద్వారా వైద్య సేవలు

1 min read

– గుర్రంపాడు లో ప్రారంభించిన రాష్ట్ర నోడల్ ఆఫీసర్ డాక్టర్ రమాదేవి
పల్లెవెలుగు , వెబ్​ చెన్నూరు: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం లో భాగంగా ప్రభుత్వం , గ్రామాలలోకి 104 ద్వారా ఫ్యామిలీ డాక్టర్, పి జి సియన్ ఏర్పాటు చేసి ప్రజల ముంగిట కె వైద్య సేవలు విస్తరించే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందని రాష్ట్ర నోడల్ ఆఫీసర్ డాక్టర్ రమాదేవి జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఉమా మహేష్ కుమార్ లు అన్నారు, శుక్ర వారం వారు మండలంలోని గుర్రంపాడు గ్రామపంచాయతీలో సర్పంచ్ చల్లా ప్రమీల ఆధ్వర్యంలో, వైద్య సేవలు ప్రారంభించారు, ఈ సందర్భంగా రాష్ట్ర నోడల్ ఆఫీసర్ డాక్టర్ రమాదేవి మాట్లాడుతూ, చెన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని 8 సెంటర్లుగా విభజించి ప్రతి సెంటర్ కు నెలకు రెండు మూడు సార్లు నిర్దేశించబడిన రోజులలో ఆయా ప్రాంతాలలో అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించి అక్కడి రోగులకు తగిన మందులు అందించబడతాయి అని ఆమె తెలియజేసింది, అంతేకాకుండా ఆరోగ్య శ్రీ ద్వారా ఆపరేషన్లు చేయించుకుని ఇంటి వద్ద బెడ్ మీద ఉన్న రోగులకు అవసరమైతే అక్కడికి వెళ్లి వైద్య సేవలు అందించడం జరుగుతుందని ఆమె తెలియజేశారు, ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిందని ప్రజలు ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవాలని అనే తెలియజేసింది, ఈ కార్యక్రమంలో వై ఎస్ ఆర్ సి పి యువ నాయకులు చల్ల అన్వేష్ రెడ్డి, డాక్టర్ బి చెన్నారెడ్డి, డాక్టర్ వంశీ కృష్ణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

About Author