నిఫా వైరస్ పై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
1 min read– కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల లోని నిఫా వైరస్ పై మాక్ డ్రిల్
– ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.V.వెంకట రంగా రెడ్డి, మాట్లాడుతూ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల లోని నిఫా వైరస్‌ను ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన ప్రోటోకాల్ లను ఈ రోజు వైద్య సిబ్బందితో మాక్ డ్రిల్ ద్వారా ప్రారంభించినట్లు తెలిపారు.కేరళ రాష్ట్రంలో నమోదైన నిపా కేసుల దృష్ట్యా ఆస్పత్రిలోని నిఫా వైరస్‌ను ఎదుర్కోవడానికి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.ఆసుపత్రిలోని ఐడీ బ్లాక్ లో నిఫా వైరస్ కి సంబంధించిన బ్లాక్ కేటాయించినట్లు తెలిపారు.ఆసుపత్రిలో ఇప్పటివరకు ఎలాంటి నిఫా వైరస్ కేసు నమోదు కాలేదని తెలియజేశారు.ఆసుపత్రిలో నిఫా వైరస్ పై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.పల్మోనాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ, అనస్థీషియా, జనరల్ మెడిసిన్, మరియు మైక్రోబయాలజీ ఫ్యాకల్టీతో కూడిన రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు, రెడీ చేసినట్టు తెలిపారు. సూపర్ స్పెషలిస్ట్‌లు అనస్థీషియా / ఎమర్జెన్సీ మెడిసిన్ నుండి (కార్డియాలజీ మరియు న్యూరాలజీ) ఫ్యాకల్టీ వైద్యులు అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేశారు.PPE కిట్‌లకు సంబంధించి తగినంత స్టాక్ అందుబాటులో ఉన్నట్టు తెలియజేశారు.CPAP మరియు BIPAP మెషీన్‌ల కోసం NIV మాస్క్ అందుబాటు ఉండేలా సర్జికల్ స్టోర్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.యాంటీవైరల్ డ్రగ్స్ రిబావిరిన్ మరియు ఫ్లావిపావిర్ మరియు అత్యవసర ఔషధాలు అందుబాటు లో ఉండేలా సర్జికల్ అండ్ మెడికల్ స్టోర్ లకు ఆదేశాలు జారీ చేశారు.ఆస్పత్రిలోని ఆక్సిజన్ మరియు ఆక్సిజన్ పోర్ట్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు.ఈ కార్యక్రమానికి ఆసుపత్రి CSRMO, డా.వెంకటేశ్వరరావు, డిప్యూటీ CSRMO డా.హేమనళిని, ఆర్ఎంఓ, డా.వెంకటరమణ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.శివ బాల నగంజన్, డా.కిరణ్ కుమార్, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.V.వెంకట రంగా రెడ్డి, తెలిపారు.