బిషప్ జన్మదినం సందర్భంగా మెగా వైద్య శిబిరం ఏర్పాటు
1 min read

సుమారు 500 మందికి ఆరోగ్య పరిక్షలు మందులు పంపిణీ
సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ తాతిపూడి ఇమ్మానుయేల్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహణ
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు :ఏలూరు పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ మోస్ట్ రెవరెండ్ బిషప్ డాక్టర్: జయరావు పొలిమేర పుట్టిన రోజు ఉత్సవాలు ఘనంగా కన్నుల పండుగగా జరిగాయని పెరికె ఫౌండేషన్ చైర్మన్ పెరికె వరప్రసాదరావు తెలిపారు. బిషప్ జయరావు పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. సుమారు 500 మందికి ఉచితంగా ఆరోగ్య సమస్యలపై పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగిందది. అనంతరం బిషప్ కి పూల బొకేలు అందించి, శాలువాలు కప్పి గజమాలతో ఘనంగా సత్కరించరు. ఏలూరు పీఠాధిపతులు బిషప్ జయరావు పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం విజయరాయి జైసిల ప్రాంగణం పెదవేగి మండలం నందు పెద్ద ఎత్తున జాబు మేళ సోషల్ సర్వీస్ సెంటర్ ఏలూరు మేత్రాసాన డైరెక్టర్ తాతపూడి ఇమాన్యుల్ సారధ్యంలో జాబు మేళ నిరస్తున్నామని నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబు మేలని సద్వినియోగం చేసుకోవాలని ప్రైవేట్ కంపెనీస్ లో ఉద్యోగాలు పొందవచ్చు అని తెలిపారు.


