NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సచివాలయ సిబ్బందిని సత్కరించిన సర్పంచ్..

1 min read

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్​ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని చౌటుకూరు గ్రామ సచివాలయ సిబ్బంది బదిలీ అయిన సందర్భంగా 49 బన్నూరు గ్రామ సర్పంచ్ దంపతులు జి భూదేవి,పిక్కిలి సాంబశివుడు గురువారం మధ్యాహ్నం ఘనంగా సత్కరించారు.సచివాలయ సిబ్బంది ఐదు సంవత్సరాలు పూర్తి కావడంతో సాధారణ బదిలీల్లో భాగంగా బదిలీపై వెళ్లారు.బన్నూరు పంచాయితీ కార్యదర్శి ఎస్.బీజాన్ భీ అవుకు మండలం సంగపట్నం కు బదిలీ అయ్యారు.డిజిటల్ అసిస్టెంట్ వెంకటేష్ దేవనూరుకు,గ్రామ సర్వేయర్ అజీమ్ ఓర్వకల్లు మండలం ఉప్పలపాడుకు,ఇంజి నీరింగ్ అసిస్టెంట్ పవిత్ర మాసపేటకు, వెల్ఫేర్ అసిస్టెంట్ సామన్న, ఏఎన్ఎం అనంతలక్ష్మి చింతలపల్లెకు,ఎంపీఈవో జబీ ఉల్లా ప్యాపిలీకి బదిలీ అయ్యారు.గతంలో పనిచేసి వెళ్లిన ఇంజనీరింగ్ అసిస్టెంట్ చరణ్ లను సర్పంచ్ శాలువాలు పూలమాలలతో ఘనంగా సత్కరించారు.వారు చేసిన సేవలను వారు కొనియాడారు.ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి వేల్పుల వినయ్ చంద్ర పాల్గొన్నారు.

About Author