NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సినిమా టికెట్ ధరలపై పునరాలోచించండి: చిరంజీవి

1 min read


పల్లెవెలుగు వెబ్: ఆన్‌లైన్ సినిమా టికెట్ విధానంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి ఇది దోహదపడుతుందన్నారు. అయితే థియేటర్ల మనుగడను దృష్టిలో ఉంచుకుని సినిమా టిక్కెట్ల ధరలపై ప్రభుత్వం పునరాలోచించాలని మెగాస్టార్ విజ్ఞప్తి చేశారు. సినిమా అనే రంగంపై లక్షలాది కుటుంబాలు ఆధారపడ్డాయని.. తగ్గించిన సినిమా టికెట్ల ధరలపై కాలానుగుణంగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న టికెట్ ధరలను అమలు చేయాలన్నారు. దేశమంతా ఒకే పన్ను వ్యవస్థ జీఎస్టీ అమలవుతున్నప్పుడు.. సినిమాలకు కూడా అదే వెసులుబాటు కల్పించడం సమంజసమన్నారు.

About Author