బంగారం ‘హాల్ మార్కింగ్’ పై వ్యాపారుల నిరసన !
1 min readపల్లెవెలుగు వెబ్ : బంగారు ఆభరణాల పై హాల్ మార్కింగ్ తప్పనిసరిగా వేయాలని కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనను వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ బంగారు ఆభరణాల అమ్మకాల నియంత్రణకు హాల్ మార్కింగ్ తోడ్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. బులియన్ వ్యాపారులు .. బంగారం స్వచ్చతకు గుర్తింపుగా హాల్ మార్కింగ్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే మరికొన్ని వ్యాపార వర్గాలు మాత్రం మరోలా ఆలోచిస్తున్నాయి. హాల్ మార్కింగ్ తమ వ్యాపారాలపై ప్రభావం చూపుతుందని బంగారం వ్యాపారులు చెబుతున్నారు. ఇది ప్రభుత్వ ఏకపక్ష చర్యగా వారు అభివర్ణిస్తున్నారు. దీనికి నిరసనగా ఈనెల 23న ఒకరోజు సమ్మె నిర్వహించాలని ఆలిండియా జువెల్లరీ అండ్ జెమ్స్ డొమెస్టిక్ కౌన్సిల్ నిర్ణయించింది.