ఘనంగా మిలాదున్ నబి వేడుకలు…
1 min read

హొళగుంద న్యూస్ నేడు : హొళగుంద మండల కేంద్రంలో మిలాదున్ నబి వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగాయి. మిలాదున్ నబీ పండుగ సందర్భంగా మండల కేంద్రంలోని మహమ్మదీయ మస్జిద్ నుంచి , మిలాద్ ఉన్ నబీ కమిటీ ముత్తవల్లి ఫక్రుద్దీన్ సాబ్,శాలి ఫజల్ సాబ్,శాలి మస్తాన్, షబ్బీర్, శాలి రహంతుల్లా, బి టి ఖాసీం,ఖలందర్, అదేవిధంగా స్థానిక నురాని మస్జిద్ నుంచి దూదేకుల నూర్ భాషా సంఘం ముతవల్లి కబీర్ సాబ్,సనవుల్ల, హుస్సేన్ పీరా, వీరన్న అధ్యక్షతన చిన్నారులు,కమిటీ సభ్యులు, పెద్దలందరు కలిసికట్టుగా ర్యాలీ చేపట్టారు. అనంతరం బస్టాండ్ నందు మౌలానా కబీర్ సాబ్, టిప్పు సుల్తాన్ లు మహమ్మద్ ప్రవక్త సర్వమానవాళికి బోధించిన విషయాలను ప్రసంగించారు. మహమ్మద్ ప్రవక్త ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం రబీవ్వుల్ అవ్వల్ మాసం 12 వ తేదీన మక్కా నగరంలో జన్మించారని తెలిపారు.మహమ్మద్ ప్రవక్త శాంతి, పరమత సహనం, తల్లిదండ్రులు, పెద్దలపట్ల గౌరవం, పేదల పట్ల దానగుణం, దయ, కరుణ, త్యాగనిరతితో ప్రతి ఒక్క మానవుడు తన జీవితం కొనసాగించాలని బోధించిన మహిమాన్వితుడు మహమ్మద్ ప్రవక్త అని అన్నారు. ప్రతి ఒక్కరూ మహమ్మద్ ప్రవక్త బోధించిన మార్గంలో నడుచుకొని సుఖ సంతోషాలతో జీవించాలని అన్నారు. ఈ కార్యక్రమం లో హబీబుల్లా, కైఫ్, టిప్పు, వలి భాష, మహబూబ్ బాషా, జావిద్, మౌలా సాబ్, హుస్సేన్ పీరా, సుభాన్, జిలాన్, దాదావలి, సాబ్ హుసేని, శాలి అమాన్,యువత, చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


