NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పిఈటి ఉపాధ్యాయుడు నరసింహ రాజుకు స్పోర్ట్స్ ఎక్స్లేన్స్ అవార్డు

1 min read

జిల్లా కలెక్టర్  పి రంజిత్ భాష  చేతులమీదుగా స్పోర్ట్స్ ఎక్స్లెన్స్ అవార్డు ప్రదానం

మంత్రాలయం న్యూస్ నేడు : నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో  పిఈటి ఉపాధ్యాయులు గా విధులు నిర్వహిస్తున్న నరసింహ రాజుకు 2024 – 2025 సంవత్సరానికి గాను స్పోర్ట్స్ ఎక్స్లేన్స్ అవార్డు ను జిల్లా కలెక్టర్ రంజిత్ భాష ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024-25 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము క్రీడలలో రాష్ట్రస్థాయిలో మరియు జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచిన పాఠశాలకు జిల్లాస్థాయి స్పోర్ట్స్ ఎక్స్లెన్స్ అవార్డు ప్రధానం చేస్తుంది. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో  మంత్రాలయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు క్రీడలలో ఎక్కువ సంఖ్యలో రాష్ట్ర , జాతీయస్థాయిలో ప్రతిభ కనబరచడం వల్ల జిల్లా స్పోర్ట్స్ ఎక్స్ప్రెస్ అవార్డు కలెక్టర్  చేతుల మీదుగా ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొనిపాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు నరసింహ రాజు స్పోర్ట్స్ ఎక్స్లెన్స్ అవార్డు అందుకోవడం జరిగిందన్నారు. దీంతో ప్రదానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అబినందనలు తెలిపారు. మంత్రాలయం పాఠశాలకు స్పోర్ట్స్ ఎక్స్లెన్స్ అవార్డు రావడానికి సహకరించిన ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు.

About Author