కనీస వివాహ వయసు.. ఎంఐఎం అధినేత ఫైర్ !
1 min readపల్లెవెలుగువెబ్ : అమ్మాయిల కనీస వివాహ వయసు 21 ఏళ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ అంశం పై ఎంఐఎం అధినే అసదుద్దీన్ ఓవైసీ కేంద్రాన్ని ప్రశ్నించారు. 18 ఏళ్లకే ఆడపిల్ల ప్రధానిని ఎన్నుకోగలిగితే ఎందుకు పెళ్లి చేసుకుని భాగస్వామిని కాకూడదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పితృస్వామ్యానికి పెద్ద పీటవేసిందని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అని విమర్శించారు. పైగా 18 ఏళ్ల వయస్సులో ఒక భారతీయ పౌరుడు ఒప్పందాలపై సంతకం చేయవచ్చు, వ్యాపారాలు ప్రారంభించవచ్చు, ప్రధాన మంత్రులను ఎన్నుకోవచ్చు ,ఎంపీలు,ఎమ్మెల్యేలను ఎన్నుకోవచ్చు గానీ పెళ్లిళ్లు చేసుకోకూడదా అంటూ ప్రశ్నించారు.