NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దళారులకు ధాన్యం అమ్మ వద్దని రైతులకు మంత్రి విజ్ఞప్తి

1 min read

ఖరీఫ్,రబీ కాలంలో12 వేల 400 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేశాం

రాష్ట్ర పౌరసరఫరాలశాఖ జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్

గోదావరి సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశం

ఉపాధి హామీ లక్ష్యాలను జూన్ 15 లోపు పూర్తి చేయాలని నిర్దేశం

దళారులకు ధాన్యం అమ్మ వద్దని రైతులకు మంత్రి విజ్ఞప్తి

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు :  ఖరీఫ్, రబీ కాలంలో 12 వేల  400 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.  ఏలూరులో సోమవారం జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశం అనంతరం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రికేయులకు డిఆర్సి సమావేశంలో చర్చించిన అంశాలను పాత్రికేయుల సమావేశంలో  వివరించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గతంలో కన్నా 8. 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అదనంగా కొనుగోలు చేశామని, రైతులకు 24 గంటలలోగా సొమ్ముని వారి ఖాతాలలో జమ చేశామన్నారు.గతంలో ఈ స్థాయిలో ధాన్యం కొనుగోలు జరగలేదని మంత్రి చెప్పారు. ఏలూరు జిల్లాలో రబీ కి సంబంధించి ఇప్పటికే,2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి అయిందని, ఇప్పటివరకు 20 వేల  225 మంది రైతుల నుండి రూ.575 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేయగా,అందులో ఇప్పటికే రూ. 486 కోట్లు రైతుల ఖాతాలకు జమ చేశామన్నారు. తడిచిన ధాన్యం విషయంలో కొనుగోలు చేసేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగిందన్నారు.దయచేసి దళారులకు ధాన్యం అమ్మవద్దని రైతులకు మంత్రి విజ్ఞప్తి చేశారు.రాబోయే కాలంలో మరింత పారదర్శకంగా జవాబుదారీతనంతో రాబోయే కాలంలో మంచి పరిపాలన ప్రజలకు అందించి ఏలూరు జిల్లాను అభివృద్ధి పథంలో నిలుపుతామని స్పష్టం చేశారు.  ప్రజలతో మమేకమై ప్రజలకు జవాబుదారితనంతో అధికారులు పనిచేయాలని నిర్దేశించామన్నారు.   రానున్న రోజుల్లో ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా అడుగులు వేయాలని చెప్పడం జరిగిందన్నారు. కాలువలలో  పూడికతీత పనులు బాగా జరిగితే  దిగువ ప్రాంతం రైతులకు మేలు జరుగుతుందన్నారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం లక్ష్యాలను జూన్ 15వ తేదీ లోపు పూర్తి చేయాలని నిర్దేశించడం జరిగిందన్నారు. అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలో ఏలూరు జిల్లాను మూడవ స్థానంలో ఉంచేందుకు ఉద్యాన సాగు ప్రధానమైన భాగమని దీనిపై  దృష్టి పెట్టేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఐదు ఎకరాల లోపు రైతులు ఆయిల్ ఫాం కోకో పంటలు వేసేందుకు అవసరమైన పూర్తి సమాచారాన్ని అందించాలని అధికారులను ఆదేశించామన్నారు.   రాబోయే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ మంది పిల్లలను నమోదు చేసేందుకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని నిర్దేశించడం జరిగిందన్నారు.  ఇందుకు అంగన్వాడి పిల్లలు కూడా పాఠశాలలో చేర్చేలా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో గణనీయంగా విద్యార్థుల నమోదు పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని కనీసం 13వేల మంది విద్యార్థులను పాఠశాలల్లో నమోదు చేయాలని నిర్దేశించామన్నారు ఈ విషయంపై సోషల్ మీడియా ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు.  అదేవిధంగా మోడల్ స్కూల్ ఉద్దేశాన్ని, సౌకర్యాలను  తల్లిదండ్రులకు తెలియజేసి ఎక్కువ మంది విద్యార్థులు ఆ పాఠశాలలో ప్రవేశం పొందేలా చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు తాగునీటి ఎద్దడి నివారణకు విస్తృతమైన ఆలోచన చేశామని అన్నారు తాగునీటికి సంబంధించి పనులు జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని నిర్దిష్టమైన కార్యాచరణ అమలు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు తాగునీటి విషయంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను బాధ్యతాయుతంగా పరిష్కరించాలన్నారు ఏలూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కొత్తగా వచ్చిన బదిలీలతో వైద్య సిబ్బంది నియామకం, ఇతర సౌకర్యాలు మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.   రాబోయే జిల్లా సమీక్ష కమిటీ సమావేశం నాటికి    జిల్లాలో 25 శాతం కన్నా ఎక్కువ నిర్మాణం పనులు పూర్తయి అసంపూర్తిగా ఉన్న వివిధ ప్రభుత్వ భవనాల వివరాలు జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు.సమావేశంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి,  జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ,  శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య,  డా. కామినేని శ్రీనివాస్,  పత్సమట్ల ధర్మరాజు చింతమనేని ప్రభాకర్, సొంగా  రోషన్ కుమార్,  మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *