రిషిత తల్లిదండ్రులకు ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే బీవి, జయనాగేశ్వర్ రెడ్డి
1 min read
న్యూస్ నేడు ఎమ్మిగనూరు: మండలం బనవాసి గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో ఆదివారం రాత్రి తిరుపతి జిల్లా చింతవరం గ్రామానికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని రిషిత(16) బాత్రూంలో చున్నితో ఉరివేసుకొని మరణించడం జరిగింది, ఈ విషయం తెలిసిన వెంటనే ఎమ్మిగనూరు నియోజకవర్గం శాసనసభ్యులు సభ్యులు గౌరవనీయులు ఎమ్మెల్యే డాక్టర్ బి వి జయ నాగేశ్వర రెడ్డి హాస్పిటల్ కి వెళ్లి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని రిషిత మృతదేహాన్ని చూసి చలించిపోయారు, తర్వాత ఆమె తల్లిదండ్రులకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం మండల కమిటీ సభ్యుల ద్వారా పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కె. టీ వెంకటేష్ మండల నాయకులు బోడబండ సురేష్ చెన్నాపురం నాగరాజు సోగనూరు రాఘవేంద్ర కలుగుట్ల కొండన్న బనవాసి అయ్యాలప్ప వీర నాగప్ప చంద్ర హంపయ్య రామకృష్ణ వీరభద్ర తదితరులు పాల్గొన్నారు.