నూతన విద్యుత్ సబ్ స్టేషన్ కు ఎమ్మెల్యే భూమి పూజ…
1 min read
కొణికి గ్రామంలో నూతనంగా 33/11 కేవి విద్యుత్ ఉప కేంద్రం కి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ భూమి పూజ
రైతులకు అందుబాటులో నిరంతర విద్యుత్
పాల్గొన్న విద్యుత్ అధికారులు …ఎస్ఇ సాల్మన్ రాజు,డిఇ అంబేద్కర్
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : పెదపాడు మండలం కొణికి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ శుక్రవారం ప్రారంభించారు.శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొని మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిరంతరం విద్యుత్ సదుపాయం అందుబాటులో ఉంటుందని, రైతులకు ఎంతో మేలుకొరకంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యుత్ శాఖ సూపర్ ఇంటెండింగ్ ఇంజనీర్ సాల్మన్ రాజు, డి.ఈ అంబేద్కర్, ఏ ఈ సహా పలువురు కూటమి నాయకులు అధికారులతో కలిసి నూతన విద్యుత్ సబ్ స్టేషన్ కు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ భూమి పూజ నిర్వహించారు.
