NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వాల్మీకి మహర్షి విగ్రహ నిర్మాణానికి ఎమ్మెల్యే ఆర్థిక సహాయం

1 min read

సులవాయి గ్రామ అభివృద్ధికి మరో అడుగు

హోళగుందన్యూస్ నేడు : ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండలం సులవాయి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న వాల్మీకి మహర్షి విగ్రహానికి ఆర్థిక సహాయం అందింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఆలూరు ఎమ్మెల్యే శ్రీ బుసినే విరుపాక్షి  విగ్రహ నిర్మాణానికి రూ.50,000లు విరాళంగా అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి గారు మాట్లాడుతూ, గ్రామాల్లో ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక అభివృద్ధి కూడా సమానంగా ముందుకు సాగాలని తెలిపారు. వాల్మీకి మహర్షి ఆశయాలు సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ విగ్రహ నిర్మాణం గ్రామ ప్రజలకు ప్రేరణగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్సిపి నాయకులు, కార్యకర్తలు, బివీఆర్​ అభిమానులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author