2,15,362 రూ.ల సీఎంఆర్ఎఫ్ ను పంపిణీ చేసిన ఎమ్మెల్యే..
1 min read
అర్హులైన వారందరికీ సీఎం సహాయ నిధి..
నందికొట్కూరు, న్యూస్ నేడు: అర్హులైన వారందరికీ ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేస్తామని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు.గురువారం నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న ముగ్గురు లబ్ధిదారుల ఇండ్ల వద్దకు వెళ్లి 2,15,362 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. పట్టణానికి చెందిన పసుల శివప్రియకు-1,41,662 రూ.లు,జయన్నకు 36,600, పఠాన్ అబ్దుల్ హఫీజ్ కు-37,700 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే మరియు మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లబ్ధిదారులు మరియు కుటుంబ సభ్యులతో మాట్లాడారు.ముఖ్యమంత్రి సహాయ నిధిని వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. దరఖాస్తు చేసుకున్న అతికొద్ది రోజులకే సీఎం సహాయ నిధి రావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యేకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి,క్లస్టర్ ఇన్చార్జి ముర్తు జావలి,జనార్ధన్,సౌదీ చాంద్,కృష్ణారెడ్డి,అయ్యన్న,ఆర్ట్ శ్రీను,బ్రహ్మయ్య,సోషల్ మీడియా పసుల శ్రీనివాసులు నాయుడు తదితరులు పాల్గొన్నారు.
