మైనర్ పై ఎమ్మెల్యే కుమారుడి అత్యాచారం !
1 min readపల్లెవెలుగువెబ్ : రాజస్థాన్‌లో దారుణం జరిగింది. దౌసా జిల్లాలో పదో తరగతి చదువుతున్న బాలికపై కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్‌గఢ్ ఎమ్మెల్యే జొహారీలాల్ మినా కుమారుడు దీపక్ మినా, అతడి స్నేహితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు వీడియో తీసి బెదిరింపులకు పాల్పడి 15 లక్షల రూపాయల నగదు, బంగారం దోచుకున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఎమ్మెల్యే కుమారుడితో పాటు ఇతర నిందితులపై అత్యాచారం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఘటనపై మూడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది.