మోదీ కాళ్లకు మసాజ్ చేయడానికి వెళ్లారు !
1 min read
పల్లెవెలుగువెబ్ : ప్రధాని మోదీ మోకాళ్లకు మసాజ్ చేయడానికే ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన చేశారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ప్రధానికి ఎంత మసాజ్ చేసినా జగన్ జైలుకు వెళ్లడం తప్పదన్నారు. ‘హైకోర్టు తీర్పు- ప్రభుత్వ తీరు’ అనే అంశంపై విజయవాడలోని ఓ హోటల్‌లో అమరావతి పరిరక్షణ సమితి నిర్వహించిన చర్చా కార్యక్రమంలో నారాయణ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఢిల్లీ పెద్దలు జగన్‌ను పిలవ నేలేదని, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లను తాకట్టు పెట్టడానికే జగన్ స్వయంగా ఢిల్లీకి వెళ్లారని విమర్శించారు. మోదీ మోకాళ్లకు మసాజ్ చేసి, తనను కేసుల నుంచి బయటపడేయమని వేడుకున్నాడని ఆరోపించారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లి సీఎం సాధించిందేమీ లేదన్నారు.