జిల్లా గృహ నిర్మాణ సంస్థ మేనేజర్ గా మహమ్మద్ ఎస్.షరీఫ్
1 min read
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పదవీ విరమణ వయోపరిమితిని 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకు పెంచడంతో అర్హులైన రెగ్యులర్ పదవీ విరమణ చేసిన ఉద్యోగులను ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకోవడంతో గృహనిర్మాణ సంస్థమేనేజర్ గా మహమ్మద్ ఎస్.షరీఫ్ ని నియమించడం జరిగింది. ఏలూరు జిల్లా, జిల్లా ప్రధాన గృహనిర్మాణ కార్యాలయంలో ప్రస్తుతం ఉన్న ఖాళీలో ఎస్.షరీఫ్ బుధవారం విధుల్లోకి హాజరయ్యారు.


