NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంకీపాక్స్ వైర‌స్.. గుడ్ న్యూస్ చెప్పిన కేర‌ళ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దేశంలో తొలి మంకీపాక్స్ కేసుగా నమోదైన కేరళకు చెందిన వ్యక్తి కోలుకున్నాడు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్‌లో చికిత్స పొందుతున్న కొల్లాంకు చెందిన 35 ఏళ్ల ఈ వ్యక్తి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ కానున్నాడు. యూఏఈ నుంచి వచ్చిన ఈ వ్యక్తికి మంకీపాక్స్‌గా నిర్ధారణ అయింది. జులై 12న ఇతను త్రివేండ్రం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు. జులై 14న మంకీపాక్స్ లక్షణాలతో హాస్పిటల్‌లో చేరాడు. ప్రస్తుతం ఇతను మంకీపాక్స్ నుంచి పూర్తిగా కోలుకున్నాడని, అతని చర్మంపై మంకీపాక్స్ కారణంగా ఏర్పడిన దద్దుర్లు కూడా పూర్తిగా నయమయ్యాయని కేరళ వైద్యఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు.

                                        

About Author