NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్ర‌తీకారంతో ర‌గులుతున్న కోతులు.. 80 కుక్క పిల్ల‌ల్ని చంపాయా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కోతులు ప్ర‌తీకారం తీర్చుకుంటాయా?. 80 కుక్క పిల్ల‌ల్ని నిజంగా చంపేశాయా?. ఈ ప్ర‌శ్న‌ల‌కు మ‌హారాష్ట్ర‌లోని బీడ్ జిల్లా ప్ర‌జ‌లు అవున‌నే స‌మాధానం చెబుతున్నారు. ఓ కోతి పిల్ల‌ను వీధికుక్క‌లు చంపిన నేప‌థ్యంలో కోతులు కుక్క‌ల‌పై పగ‌పెంచుకున్నాయ‌ని, ఇప్ప‌టివ‌ర‌కు 80 కుక్క పిల్ల‌ల్ని చంపేశాయ‌ని స్థానికులు పేర్కొంటున్నారు. 5000 జ‌నాభా ఉండే ల‌వూల్ గ్రామంలో ఒక్క కుక్క పిల్ల కూడ బ‌తికిలేద‌ని స్థానికులు చెబుతున్నారు. కుక్క పిల్ల‌ల్ని ఎత్తైన భ‌వంతులు, చెట్ల పైకి తీసుకెళ్లి కింద ప‌డేస్తున్నాయ‌ని, అప్ప‌టికీ చ‌నిపోక‌పోతే మ‌ళ్లీ పైకి తీసుకెళ్లి పడేస్తున్నాయ‌ని పేర్కొంటున్నారు. దీని పై స్థానిక అట‌వీ శాఖ అధికారుల‌కు కూడ ఫిర్యాదు చేశార‌ట‌.

                                  
                     

About Author