వాహనదారులు..‘ రోడ్డు భద్రత’ పాటించాలి
1 min readఎస్సై బిటి వెంకటసుబ్బయ్య
పల్లె వెలుగువెబ్, గడివేముల:రోడ్డు భద్రత నియమాలు తప్పనిసారిపాటిస్తూ… ప్రమాదాలు నివారించేందుకు సహకరించాలని ద్విచక్రవాహనదారులు, మండల ప్రజలను కోరారు ఎస్సై బిటి వెంకటసుబ్బయ్య. ఆదివారం మండలంలోని గని గ్రామంలో గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫేక్ లోన్ యాప్స్ ఆన్లైన్ ద్వారా ప్రజలను మోసం చేసే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ ఈ ఫేక్ లోన్ యాప్స్ పై అవగాహన కలిగి ఉండాలన్నారు ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించి ప్రయాణం చేయాలన్నారు నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే ప్రమాదాల గురైతే కుటుంబాలకు అంతులేని ఆవేదన కలిగించిన వారు అవుతారని ఇంటి వద్ద మీకోసం ఎదురుచూసే కుటుంబ సభ్యులకు కన్నీళ్లను మిగిల్చ వద్దని ఈ సందర్భంగా తెలిపారు గ్రామాలలో ఎవరైనా కొత్తవారు సంచరిస్తే తమకు సమాచారం ఇవ్వాలని దొంగతనాలు జరగకుండా ఇళ్ల వద్ద దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు గ్రామాలలో నాటు సారా అమ్మేవారి సమాచారాన్ని పోలీస్ శాఖకు తెలపాలని నాటు సారా నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.